News November 10, 2024
ఆస్ట్రేలియా బయల్దేరిన విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయల్దేరారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఆయన వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి బీజీటీ ప్రారంభం కానుంది.
Similar News
News October 26, 2025
కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.
News October 26, 2025
ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్సైట్:https://www.federalbank.co.in/
News October 26, 2025
ICC ర్యాంకింగ్స్లో రోహిత్ నం.1!

ఆస్ట్రేలియాతో సిరీస్లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నం.1 స్థానం దక్కించుకోనున్నారు. ప్రస్తుతం 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హిట్మ్యాన్ తాజా సిరీస్లో 202 రన్స్ చేయడంతో నం.1కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న ఐసీసీ అధికారికంగా ర్యాంకులను ప్రకటించనుంది. అటు గిల్ (768 పాయింట్లు), జర్దాన్ (764 పాయింట్లు) టాప్-2లో ఉన్నారు.


