News September 30, 2024
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర లిఖించారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 27వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ 623 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించగా విరాట్ 594 ఇన్నింగ్స్లలోనే ఆ మార్కును చేరుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ ఘనత సాధించింది విరాట్ ఒక్కరే. సచిన్, కోహ్లీతో పాటు రికీ పాంటింగ్, సంగక్కర కూడా 27వేల పరుగుల మైలురాయి దాటారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: చిన్న పంచాయతీలు.. ఓటర్ల అయోమయం

చిన్న పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పార్టీ గుర్తులు లేకపోవడం, ఒక్కో పదవికి పదుల సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఏకంగా 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండటం పోటీ తీవ్రతకు నిదర్శనం. ఈ నెల 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


