News October 25, 2024

విరాట్ కోహ్లీ చెత్త రికార్డు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. టెస్టుల్లో అత్యధికంగా 47 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఏడో ప్లేయర్‌గా ఆయన నిలిచారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఒక్క రన్ మాత్రమే చేశారు. ఈ క్రమంలో టామ్ లాథమ్(47)ను సమం చేశారు. ఈ జాబితాలో క్రెగ్ బ్రాత్‌వైట్ (65) టాప్‌లో ఉండగా, ఆ తర్వాత రూట్ (64), కరుణరత్నే (51), స్టోక్స్ (50), విలియమ్సన్ (48) ఉన్నారు.

Similar News

News November 25, 2025

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

image

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్‌కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.

News November 25, 2025

మంచి జరగబోతోంది: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్‌లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

News November 25, 2025

UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

image

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్‌గా మారింది.