News October 30, 2024
విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేవు: హాగ్

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లనే రాణించలేకపోతున్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించారు. ‘విరాట్ పరిస్థితిని మరీ ఎక్కువగా అంచనా వేసి దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే విఫలమవుతున్నారు. అతడితో పోలిస్తే రోహిత్ టెక్నిక్ ప్రస్తుతం బాగుంది. ఏదేమైనా.. న్యూజిలాండ్ను భారత్ తేలికగా తీసుకోవడమే ఈ సిరీస్ ఓటమికి కారణం’ అని విశ్లేషించారు.
Similar News
News January 9, 2026
తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News January 9, 2026
చిరంజీవి సినిమా.. టికెట్ రేట్ల పెంపు

AP: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది. జనవరి 12 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.120 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.


