News April 7, 2024

‘విరాట్.. RCB నుంచి వెళ్లిపో..’

image

కోహ్లీ వంద శాతం ఎఫర్ట్ పెట్టినా ఆర్సీబీ గెలవట్లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. బ్యాటింగ్ భారాన్ని విరాట్ తన భుజాలపై మోస్తున్నారని, ఏ ఒక్కరి నుంచి సపోర్ట్ రావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది IPLలో విరాట్ 105 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 316 రన్స్ చేయగా, మిగతా RCB ప్లేయర్లందరూ కలిపి 496 రన్స్ మాత్రమే చేశారు. దీంతో కోహ్లీ ఆర్సీబీ నుంచి వెళ్లిపోవాలని, అతడికి మంచి టీమ్ అవసరమంటున్నారు.

Similar News

News November 27, 2025

కడప బౌలర్ శ్రీచరణికి రూ.1.3 కోట్లు

image

WPL మెగావేలం-2026లో తెలుగు ప్లేయర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ కడప బౌలర్‌ను రూ.1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో శ్రీచరణి రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

News November 27, 2025

PPPని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు: బొత్స

image

AP: జగన్‌కు మంచి పేరు రాకూడదనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో జగన్ ముందుకెళ్లారని, ప్రజల ఆరోగ్యం కోసం వైద్యరంగానికి నిధులు కేటాయించారని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని, అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించామని చెప్పారు. PPPని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

News November 27, 2025

WPL షెడ్యూల్ విడుదల

image

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు 4వ ఎడిషన్ కొనసాగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇవాళ WPL మెగా ఆక్షన్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్లేయర్ల వేలం కొనసాగుతోంది. మ్యాచ్‌ల తేదీలు త్వరలోనే వెల్లడించనున్నారు.