News September 3, 2025
తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించిన విరాట్

RCB విన్నింగ్ పరేడ్‌లో జరిగిన దుర్ఘటనపై విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. ‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన ఎవరూ ఊహించనిది. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణంగా ఉండాల్సిన రోజు విషాదంగా మారిపోయింది. తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన అభిమానుల కోసం ప్రార్థిస్తున్నా. ఈ నష్టం ఇప్పుడు మనలో ఒక భాగం. కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా ముందుకు వెళ్దాం’ అని కోహ్లీ ఎమోషనల్ అయ్యారు.
Similar News
News September 3, 2025
మహిళల ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.
News September 3, 2025
గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్‌ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
News September 3, 2025
హరీశ్ వల్లే వారంతా పార్టీని వీడారు: కవిత

TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.


