News April 1, 2025
A+ కాంట్రాక్టులోనే విరాట్, రోహిత్?

విరాట్, రోహిత్‌ను A+ గ్రేడ్‌లోనే కొనసాగించాలని BCCI భావిస్తున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకే బీసీసీఐ A+ గ్రేడ్‌ను కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి గ్రేడ్‌ను తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, భారత క్రికెట్‌కు వారందించిన సేవల దృష్ట్యా అగ్రస్థాయి కాంట్రాక్ట్‌లోనే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 2, 2025
CBSE, ICSE 10, 12 ఫలితాలు ఎప్పుడంటే?

దేశ వ్యాప్తంగా CBSE, ICSE 10, 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం కొనసాగుతుండగా మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో CBSE 10, 12వ తరగతి ఫలితాలు మే నెలలోనే రిలీజ్ కాగా, ఈ సారి అదే సమయంలో వచ్చే ఛాన్సుంది. ICSE సైతం మేలోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయ్యాక ఫలితాల విడుదల తేదీలపై ఆయా బోర్డులు ప్రకటన చేయనున్నాయి.
News April 2, 2025
అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్‌షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.
News April 2, 2025
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.