News November 13, 2024

విరాట్, రోహిత్ బ్రేక్ తీసుకోవాలి: బ్రెట్‌ లీ

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2024

జగన్.. మీకూ, మాకూ తేడా లేదు: షర్మిల

image

APలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ <<14602051>>అనవసరమన్న <<>>జగన్ వ్యాఖ్యలపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘బడ్జెట్ బాగోలేదని జగన్‌ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు వాళ్లకు, మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.

News November 14, 2024

ఇళ్ల పట్టాల్లో రూ.2 లక్షల కోట్ల అవినీతి: ఎమ్మెల్యే బండారు

image

AP: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40,000 కోట్లు దోచేశారన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.

News November 14, 2024

నెహ్రూకు మోదీ నివాళి.. ఆధునిక భారతపితగా కొనియాడిన రాహుల్

image

జవహర్‌లాల్ నెహ్రూకు PM మోదీ, LoP రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా ప్రముఖులు నివాళులు అర్పించారు. ‘మాజీ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆధునిక భారత పిత, ఇనిస్టిట్యూట్ల సృష్టికర్త, ప్రథమ ప్రధాని, పండిత నెహ్రూకు గౌరవనీయ వందనాలు. మీ ప్రజాస్వామ్య, ప్రగతిశీల, నిర్భయ, దార్శనిక, సమ్మిళత విలువలను దేశం మర్చిపోదు’ అని రాహుల్ అన్నారు.