News May 10, 2024
విరాట్ దూకుడును కొనసాగించాలి: కుంబ్లే
ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ‘విరాట్ తిరుగులేని ఫామ్‌లో కనిపిస్తున్నారు. అత్యుత్తమంగా ఆడుతున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫునా ఇదే ఫామ్‌ను కొనసాగించాలి’ అని అభిలషించారు.
Similar News
News January 12, 2025
కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం
TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.
News January 12, 2025
LOS ANGELES: కార్చిచ్చు ఆర్పేందుకు నీళ్లూ కరవు..!
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
News January 12, 2025
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.