News April 12, 2025

రూ.300 కోట్ల డీల్ వదిలేసుకున్న విరాట్?

image

ప్రముఖ అప్పారెల్ బ్రాండ్ పూమాతో 8ఏళ్ల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2017లో పూమాతో 8ఏళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం చేసుకున్నారు. అది ఇటీవల ముగిసింది. ఇక నుంచి తన సొంత బ్రాండ్ ‘వన్8’ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం.

Similar News

News April 19, 2025

చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం!

image

చియా సీడ్స్ వల్ల శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. 100గ్రా. చేపల్లో 200-300 మి.గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుందని, అదే 100గ్రా. చియా సీడ్స్‌‌ ద్వారా 18గ్రా. లభిస్తుందని వివరిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం, రక్తంలో మంచి కొవ్వులు పెరగడానికి రోజూ 2స్పూన్లు నానబెట్టుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు.

News April 19, 2025

ఓ దశకు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు: ట్రంప్

image

కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు తాను ఏ ఒక్కరికీ అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్‌స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమైతే US ముందడుగు వేస్తుందని వెల్లడించారు.

News April 19, 2025

ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

image

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!