News November 28, 2024

BGTలో విరాట్ పరుగుల వరద పారిస్తారు: ద్రవిడ్

image

BGT సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంచనా వేశారు. ‘కష్టమైన పిచ్‌లపై కూడా కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడూ ఆయన బ్యాటింగ్ బాగుంది. BGT సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే సెంచరీ చేయడం చాలా విశ్వాసాన్నిస్తుందనడంలో డౌట్ లేదు. సిరీస్‌లో భారీగా పరుగులు చేస్తారనుకుంటున్నాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నారు.

Similar News

News November 28, 2024

పార్ల‌మెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

image

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఏడుగురు పార్ల‌మెంటుకు వెళ్లారు. 1951-52లో అల‌హాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్‌బ‌రేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజ‌య్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.

News November 28, 2024

కశ్మీర్ మాదికాదు: నోరుజారి ఒప్పుకున్న పాక్ మంత్రి

image

ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తున్న POK ప్రజలపై పాక్ హోంమంత్రి మోహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారాయి. ‘రాజ్యాంగబద్ధంగా మీరు పాక్ పౌరులు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటే మిమ్మల్ని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దేశం నుంచి విడిపోయి భారత్‌తో కలుస్తామన్న POK ప్రజలకిది అస్త్రంగా మారింది. మరోవైపు POK పాక్‌ది కాదని స్వయంగా ఒప్పుకున్నట్టైంది.

News November 28, 2024

రఫాపై ఉన్న శ్రద్ధ.. బంగ్లాదేశ్‌పై ఏదీ?: పాక్ మాజీ క్రికెటర్

image

రఫాలో పాలస్తీనా ప్రజలపై ఉన్న శ్రద్ధ బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులపై ఎందుకు లేదంటూ పాక్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘రఫా గురించి స్పందించారు. బంగ్లాదేశ్ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘అందరి చూపు రఫా వైపు’ అంటూ గొంతెత్తిన సెలబ్రిటీలు బంగ్లాదేశ్ అల్లర్ల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.