News October 20, 2024
విరాట్ వికెట్ నాకెంతో ప్రత్యేకం: విలియం

ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన NZ బౌలర్ విలియం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘107 పరుగులు చేయడం ఇక్కడ సులభమని చెప్పలేను. మాకు వ్యతిరేకంగా ప్రపంచస్థాయి జట్టు ఉంది’ అని చెప్పారు. విరాట్ వికెట్‌పై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘మేము ఆడే ఆటలో గొప్ప ప్లేయర్‌ను ఔట్ చేయడం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అలాంటి ప్లేయర్లను చూస్తూ పెరుగుతాం’ అని తెలిపారు.
Similar News
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.
News January 26, 2026
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్!

గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో WC వార్మప్ మ్యాచుకు జట్టులో చేరుతారని వెల్లడించాయి. కాగా వరల్డ్‌కప్ ముందు తిలక్ ఫిట్నెస్ సాధించడంతో భారత్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఆయన చేరికతో జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.
News January 26, 2026
కార్లపై భారీగా టారిఫ్‌లను తగ్గించనున్న భారత్

భారత్, EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో భాగంగా యూరోపియన్ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తొలుత 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై పన్ను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఈ టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.


