News July 26, 2024
వీరేంద్ర వచ్చేశాడు!

సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకున్న ఏపీకి చెందిన <<13709226>>వీరేంద్ర<<>> ఇండియాకు చేరుకున్నట్లు సౌదీలోని ఇండియన్ ఎంబసీ Xలో పేర్కొంది. 16 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లగా.. అక్కడ వేరే ఏజెంట్‌కు ఇతడిని అమ్మేయడంతో కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. దీంతో తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్‌ను ట్విటర్ ద్వారా వేడుకున్నాడు. స్పందించిన మంత్రి వీరేంద్రను సొంతూరు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
Similar News
News December 2, 2025
వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 124 కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్లో 6, ఈస్ట్ జోన్లో 2, సెంట్రల్ జోన్లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్‌తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. ఉప్పల్‌తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <


