News August 28, 2024

అమెరికాలో దోమకాటుతో వైరస్.. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్!

image

అమెరికాలో దోమకాటు వల్ల ‘ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫలైటిస్’ అనే వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించడంతో ఆ దేశ పాలనా విభాగం అలర్ట్ అయింది. మసాచుసెట్స్, వెర్మాంట్ తదితర ప్రాంతాల్లో అనధికార లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై నిషేధం విధించారు. హెలికాప్టర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, డయేరియా, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వ్యాక్సిన్ లేదు.

Similar News

News November 20, 2025

గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

image

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.

News November 20, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డు

News November 20, 2025

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>సత్యజిత్<<>> రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌‌ 14 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://srfti.ac.in/