News October 12, 2024
టూత్ బ్రష్లపై బ్యాక్టీరియాలను చంపే వైరస్లు!

షవర్ హెడ్స్, టూత్ బ్రష్లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్లు దోహదపడతాయి.
Similar News
News November 22, 2025
Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.
News November 22, 2025
రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.
News November 22, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


