News March 19, 2024

విరుష్క జంట బ్రిటన్‌లో సెటిల్?

image

టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు బ్రిటన్‌లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క చాలా కాలం నుంచి అక్కడే ఉంటున్నారు. రెండో బిడ్డ అకాయ్‌కూ అక్కడే జన్మనిచ్చారు. పిల్లల ప్రైవసీ కోసం ఈ జంట అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నట్లు సమాచారం. భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే కోహ్లీ ఇండియాకు వస్తారని టాక్.

Similar News

News July 5, 2024

సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN

image

TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.

News July 5, 2024

14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

image

బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.

News July 5, 2024

రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!

image

యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. తన మామగారి సలహాను పాటించకపోవడంతోనే రిషి ఓడిపోయారేమోనంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూర్తి చెప్పిన సూత్రాన్ని UKలో అమలు చేస్తారేమోనని ఓడించారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.