News September 20, 2025

వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్

image

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్‌తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.

Similar News

News September 20, 2025

7,267 పోస్టులకు నోటిఫికేషన్.. అప్లికేషన్స్ స్టార్ట్

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, PG, B.Ed, డిప్లొమా పాసైనవారు OCT 23 వరకు అప్లై చేసుకోవచ్చు. PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్​ 225, వార్డెన్​ 346, Jr​ క్లర్క్​​ 228, అకౌంటెంట్​ 61, స్టాఫ్​ నర్స్​ 550, ఫీమేల్​ వార్డెన్ ​289, ల్యాబ్​ అటెండెంట్​ 146 పోస్టులున్నాయి. వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి.

News September 20, 2025

మైథాలజీ క్విజ్ – 11 సమాధానాలు

image

1. రామాయణంలో తాటకి భర్త ‘సుందుడు’. వీళ్లిద్దరి పుత్రుడే ‘మారీచుడు’.
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ‘గంగ’. వీళ్లిద్దరూ భీష్ముడి తల్లిదండ్రులు.
3. సరస్వతీ దేవి వాహనం ‘హంస’.
4. పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశంలో ఉంది.
5. దీపావళి సందర్భంగా ‘లక్ష్మీ దేవి’ని పూజిస్తారు.
<<-se>>#mythologyquiz<<>>

News September 20, 2025

ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

image

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ‌జెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్‌ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.