News October 16, 2024

నాలెడ్జ్ హబ్‌గా విశాఖ: సీఎం చంద్రబాబు

image

AP: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా విశాఖను మారుస్తామని CM చంద్రబాబు చెప్పారు. ‘భావనపాడులో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ నుంచి భావనపాడు(శ్రీకాకుళం) వరకు రోడ్డు నిర్మిస్తాం. 2025లోగా భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం. వంశధార నుంచి నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం కావాలి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాం’ అని సీఎం వెల్లడించారు.

Similar News

News November 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.

News November 11, 2025

బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

image

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.

News November 11, 2025

గూగుల్ కొత్త ఫీచర్.. బ్యాటరీ తినేసే యాప్స్‌కు చెక్!

image

బ్యాటరీ తినేసే యాప్‌లకు చెక్ పెట్టే కొత్త ఫీచర్‌ను 2026 మార్చి 1 నుంచి గూగుల్ అమలులోకి తెస్తోంది. 24 గంటల్లో 2 గంటలకు మించి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితే దానిని బ్యాటరీ డ్రెయిన్ యాప్‌గా గుర్తిస్తారు. వీటిపై డెవలపర్స్‌ను గూగుల్ ముందుగా అలర్ట్ చేస్తుంది. సమస్యను ఫిక్స్ చేయకుంటే ప్లేస్టోర్‌లో ప్రాధాన్యం తగ్గిస్తుంది. యాప్స్‌ను ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్, అప్‌డేట్ చేసుకునేటప్పుడు యూజర్లను హెచ్చరిస్తోంది.