News August 30, 2024
నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో
☞ కారిడార్-1: <<13968868>>విశాఖ స్టీల్‌ప్లాంట్ <<>>నుంచి కొమ్మాది వరకు 34.40కి.మీ, 29 స్టేషన్లు
☞ కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07కి.మీ, 6 స్టేషన్లు
☞ కారిడార్-3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75కి.మీ, 7 స్టేషన్లు
☞ కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67కి.మీ, 12 స్టేషన్లు( రెండో దశలో రూ.5734 కోట్లతో నిర్మిస్తారు)
☞☞తొలిదశలో రూ.11,498 కోట్లతో 3 కారిడార్లు చేపడతారు.
Similar News
News January 15, 2025
2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సినిమాలు ఇవే
ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’
News January 15, 2025
ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.
News January 15, 2025
హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!
తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్‌నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.