News November 2, 2024

విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM

image

AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.

Similar News

News December 31, 2025

శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు

image

AP: కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. CCTV ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన ఓ యువకుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకుడితో జరిగిన వ్యక్తిగత వివాదం కారణంగానే శివ లింగం ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అయ్యారు.

News December 31, 2025

‘ధురంధర్‌’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

image

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.

News December 31, 2025

25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్‌లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: ssc.gov.in