News September 13, 2025
విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News September 13, 2025
IOBలో 127 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB)లో 127 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఆర్క్/బీటెక్/బీఈ/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. 01-09-2025 నాటికి 25-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <
News September 13, 2025
వర్షాలు.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News September 13, 2025
కోళ్ల ఫారాల్లో ‘లిట్టర్’ నిర్వహణ ముఖ్యం

లిట్టర్ అనేది కోళ్ల ఫారాలలో నేలపై గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.