News March 17, 2024

విశాఖ: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.

Similar News

News September 29, 2024

విదేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

image

అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

News September 28, 2024

టీమ్ఇండియా జట్టులో వైజాగ్ కుర్రాడికి చోటు

image

విశాఖ కుర్రాడు <<14221996>>నితీశ్<<>> కుమార్ రెడ్డి టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు లభించింది. నితీశ్ 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించారు. IPL 2024లో 13 మ్యాచుల్లో 303 పరుగులతో రాణించి అందరి దృష్టి ఆకర్షించారు. అనంతరం జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికైనా గాయంతో ఆ పర్యటనకు దూరమయ్యారు. బంగ్లాతో పోరులో ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశముంది.

News September 28, 2024

ఈనెల 30న భారీ పాదయాత్రకు విశాఖ స్టీల్‌ కార్మికుల పిలుపు

image

ఉక్కు కార్మికులు ఈనెల 30న భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల గేట్‌ పాస్‌లను వెనక్కి తీసుకోవాలంటూ HODలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకపక్క ప్రైవేటీకరణ చేయబోమంటూ కేంద్రం సెయిల్‌లో విలీనానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రకటనలు వస్తున్నాయి. మరోపక్క కార్మికులను తొలగిస్తోంది.