News August 29, 2025
సురక్షిత నగరాల్లో విశాఖకు చోటు

దేశంలో మహిళల జీవనం, భద్రతకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, ముంబైలతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. మహిళల భద్రత, సురక్షిత జీవన పరిస్థితులపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ సర్వే చేసింది. మహిళలకై మౌలిక సదుపాయాలు, పోలీసింగ్, పౌరభాగస్వామ్యం ఈ నగరాల్లో ఉన్నట్లు తేలింది. దక్షిణాదిలో కేవలం విశాఖకే చోటు దక్కడం విశేషం.
Similar News
News August 29, 2025
విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి తెలుసా?

హీరో <<17551492>>విశాల్<<>>, హీరోయిన్ సాయి ధన్షిక నిశ్చితార్థం జరిగింది. TN తంజావూరుకు చెందిన ఆమె 2006లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘కబాలి’లో రజినీకాంత్ కూతురిగా కనిపించారు. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించారు. వీరిద్దరూ 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఓ సభలో ధన్షికపై కొన్ని కామెంట్స్ రావడంతో విశాల్ అండగా నిలిచారని, ఆ స్నేహం ప్రేమగా మారిందని టాక్. విశాల్, ధన్షికల వయసు 48, 35.
News August 29, 2025
RECORD: 4 బంతుల్లో 4 వికెట్లు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌తో మ్యాచులో నార్త్ జోన్ ఫాస్ట్ బౌలర్ ఆఖిబ్ నబీ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. 53వ ఓవర్లో చివరి 3 బంతులకు 3 వికెట్లతో హ్యాట్రిక్ సాధించిన అతడు, తాను వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి మరో వికెట్ తీశారు. దీంతో ఈ టోర్నీలో 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మొత్తంగా 5 వికెట్లు సాధించారు. ఇది ఆయనకు డెబ్యూ మ్యాచ్ కావడం గమనార్హం.
News August 29, 2025
మా లక్ష్యం అదే.. జపాన్‌లో మోదీ

వచ్చే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ (జపాన్ కరెన్సీ)ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని PM మోదీ పేర్కొన్నారు. జపాన్ PM షిగేరు ఇషిబాతో ఆర్థిక సదస్సు అనంతరం మోదీ మాట్లాడారు. జపాన్ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని మోదీ చెప్పారు. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, హైస్పీడ్ రైలుపై పరస్పర సహకారం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.