News March 31, 2025
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వ వైభవం తేవాలి: సీఎం

AP: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కుశాఖ అధికారులు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన, బ్లాస్ట్ ఫర్నేస్ తదితర అంశాలపై చర్చించారు. ఉక్కు కర్మాగారానికి, ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం అన్నారు. దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీకి SPFతో భద్రత కల్పిస్తామన్న సీఎంకు శ్రీనివాసవర్మ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News April 2, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్(1995)’ సినిమాలో టైటిల్ రోల్‌తో కిల్మర్ ప్రసిద్ధి పొందారు. టాప్ గన్, టాప్ గన్: మావ్రిక్, విల్లో, ది డోర్స్, టాప్ సీక్రెట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
News April 2, 2025
పంత్‌పై సంజీవ్ గోయెంకా సీరియస్?

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో LSGకి ఘోర ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గతంలో LSG కెప్టెన్ రాహుల్‌తో ఇలాగే మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆ ప్లేయర్ జట్టుకూ దూరమయ్యారు. కాగా, వేలంలో రూ.27 కోట్లు పలికిన పంత్ 3 మ్యాచుల్లో 17 పరుగులే చేయడం, జట్టు ఓడిపోతుండటంపై ఆయన క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
News April 2, 2025
‘లాపతా లేడీస్’ కథ దొంగిలించారా?.. రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.