News March 21, 2024

విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు: లోకేశ్

image

AP: వైజాగ్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేశ్ తెలిపారు. ‘ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే బినామీ కంపెనీ పేరుతో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 31, 2026

కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు నివారణ ఎలా?

image

ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణం వల్ల కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి రిడోమిల్ 3 గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంటలో తెలుగు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రిడోమిల్ 3గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News January 31, 2026

కుప్పంలో ప్రయోగం… రాష్ట్రమంతా అమలు: CM

image

AP: కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల అని, ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేసి రాష్ట్రమంతా అమలు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘లక్షమందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ ద్వారా దీన్ని అమలు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్‌తో APని అగ్రస్థానంలో నిలబెడతాం. కుప్పం దానికి మొదటి మెట్టు. ఇక్కడ ₹7088 CRతో 16 పరిశ్రమలు వచ్చాయి’ అని వివరించారు.

News January 31, 2026

బాలికల కోసం స్కాలర్‌షిప్.. నేడే చివరి తేదీ

image

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ 2025 సాయపడనుంది. దీని ద్వారా ఏటా రూ.30,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ అండర్‌గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 31 జనవరి 2026. వెబ్‌సైట్: <>https://azimpremjifoundation.org<<>>