News March 6, 2025

విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చించా: సీఎం

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

Similar News

News March 12, 2026

చైనాకు 1.2 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు?

image

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే చమురు నౌకలపై దాడి చేస్తామని బెదిరిస్తున్న ఇరాన్.. ఆ మార్గం ద్వారా వెళ్లే తన షిప్‌మెంట్స్‌ను మాత్రం ఆపలేదని తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ ప్రధాన ఇంపోర్టర్ అయిన చైనాకు దాదాపు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు పంపినట్లు సమాచారం. అమెరికా/ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడం కోసం హార్ముజ్‌ను ఆయుధంగా వాడుకుంటున్న ఇరాన్ వల్ల భారత్ సహా అనేక దేశాల చమురు నౌకలు ఆగిపోయాయి.

News March 12, 2026

X యూజర్లకు షాక్

image

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్‌ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్‌ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.

News March 12, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.