News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్

ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.
Similar News
News November 26, 2025
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.
News November 26, 2025
రేవంత్ రూ.50వేల కోట్ల విద్యుత్ స్కాం: హరీశ్‌రావు

TG: CM రేవంత్ మరో అతిపెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేశారని, ఇది అక్షరాల రూ.50వేల కోట్ల కుంభకోణం అని హరీశ్‌రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని, కమీషన్ల కక్కుర్తికి మాస్టర్ ప్లాన్ వేశారని మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.7.92 ఖర్చు చేయబోతున్నారని, ఇది ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కం తెస్తున్నారని విమర్శించారు.
News November 26, 2025
ఈ రెస్టారెంట్లో సింగిల్స్‌కు నో ఎంట్రీ!

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.


