News January 10, 2025

విశాల్ త్వరలోనే కోలుకుంటారు: జయం రవి

image

హీరో విశాల్ అనారోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. కష్టాలను అధిగమించి ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ‘విశాల్ చాలా ధైర్యవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. త్వరలోనే సింహం మాదిరి గర్జిస్తారు’ అని పేర్కొన్నారు. <<15094492>>‘మదగజరాజు’<<>> ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ మాట్లాడటం అభిమానులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

Similar News

News August 16, 2025

మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూతురు భారతి ఘట్టమనేని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

News August 16, 2025

సర్పంచ్ సాబ్‌లు వచ్చేదెప్పుడో.. బిల్లులు పడేదెప్పుడో?

image

TG: బిల్లులు పేరుకుపోవడంతో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. కొత్త సర్పంచులు వచ్చాకే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల అవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు గ్రామాలకు శానిటరీ, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉందంటున్నారు. అటు BC రిజర్వేషన్లతో ‘స్థానిక ఎన్నికలు’ ఆలస్యం అవుతున్నాయి.

News August 16, 2025

‘కూలీ’కి రూ.20 కోట్లు.. ఆమిర్ ఏమన్నారంటే?

image

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ కోసం తాను రూ.20కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ కోసం రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. రజినీతో కలిసి తెరపై కనిపించడమే పెద్ద రివార్డు అని, తాను అతిథి పాత్రలో నటించినట్లు తెలిపారు. చిత్రంలో రజినీ, నాగార్జున అసలైన హీరోలన్నారు. ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.