News January 3, 2025

13 ఏళ్లకు థియేటర్లలోకి విశాల్ మూవీ

image

తమిళ హీరో విశాల్ నటించిన మదగజరాజ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. 2011లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సంక్రాంతికి తమిళంలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ నెల 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటించారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం ఇందులో కీలక పాత్ర పోషించారు.

Similar News

News December 10, 2025

అవినీతి రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి

image

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఆమె పేర్కొన్నారు.

News December 10, 2025

న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

image

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <>ట్వీట్<<>> చేశారు.

News December 9, 2025

OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.