News July 25, 2024

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు

image

AP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా MLA విష్ణుకుమార్ రాజు, పార్టీ విప్‌గా MLA ఆదినారాయణరెడ్డి ఎంపికయినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వీరిద్దరి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ పంపినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత కుమారి, దాసరి సుధ, పి.విష్ణుకుమార్ రాజులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

Similar News

News April 9, 2026

డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్?

image

TG: డిగ్రీ ప్రవేశాలకు AY 2027-28 నుంచి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం DOST ద్వారా ఇంటర్ మార్కులు, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పరీక్షకు ఓకే చెబితే DOST నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు తీసుకొని సబ్జెక్టుల వారీగా టెస్టులు పెడతారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సైతం దీనిని సిఫార్సు చేసింది.

News April 9, 2026

RTC ఉద్యోగుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా

image

RTC ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న TGSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా కల్పించనున్నట్లు ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)లో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, 38వేలకు పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని వివరించారు.

News April 9, 2026

‘ప్రకాశం’లో మాగ్నటైట్ .. త్వరలో భూసమీకరణ!

image

AP: ప్రకాశం జిల్లాలో క్వాలిటీ మాగ్నటైట్ రకం ఐరన్‌వోర్ పుష్కలంగా ఉన్నట్లు JSW గ్రూప్ నిర్ధారించింది. మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలు, లింగ సముద్రం, వలేటివారిపాలెం, పామూరు మండలాల్లో విస్తరించినట్లు గుర్తించింది. సాధారణంగా 50 మీటర్ల లోతున ఐరన్‌వోర్ ఉంటుందని, ఇక్కడ 10 మీటర్ల నుంచే నాణ్యమైన ఇనుప ఖనిజాలు ఉన్నట్లు అంచనా వేస్తోంది. త్వరలోనే భూసమీకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు.