News December 11, 2024
విశ్వక్, అనుదీప్ కొత్త మూవీ ‘ఫంకీ’

విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 12, 2025
చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

భారత్ విషయంలో చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. జనరిక్ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత నెలలో నిర్వహించిన టెండర్లో సిప్లా, నాట్కో, హెటిరో, రెడ్డీస్ వంటి ఫార్మా సంస్థలు చైనా ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ‘డపాగ్లిఫ్లోజిన్’ అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను సప్లై చేయనున్నాయి. ఇతర టాబ్లెట్లూ సరఫరా చేయనున్నాయి.
News November 12, 2025
నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.
News November 12, 2025
మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.


