News April 9, 2025
జులై 24న విశ్వంభర రిలీజ్?

వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. VFX పనులను త్వరగా పూర్తి చేసి జులై 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. 2002లో ఇంద్ర సినిమా ఇదే తేదీన రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Similar News
News April 17, 2025
అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం కోరిన సీఎం

TG: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం జైకా ప్రతినిధులతో CM రేవంత్ చర్చలు జరిపారు. మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, RRR ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులకు ఆర్థికసాయం కోరారు. మెట్రో రెండో దశకు రూ.11,693 కోట్లు అడిగారు. HYDను న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్థిక సాయం పొందేందుకు కేంద్రంతో కలిసి ప్రాజెక్టులను కొనసాగించాలని జైకా ప్రతినిధులు సూచించారు.
News April 17, 2025
విధ్వంసం.. 26 బంతుల్లో సెంచరీ

యూరోపియన్ క్రికెట్ సిరీస్(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్‌లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.
News April 17, 2025
రూ.10.75 కోట్ల ప్లేయర్.. బెంచ్‌కే పరిమితం

IPL: గత ఐదేళ్లు SRHకు కీలక బౌలర్‌గా ఉన్న నటరాజన్‌ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఆక్షన్‌లో DC రూ.10.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసినా బెంచ్‌కే పరిమితం చేస్తోంది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటరాజన్ గత సీజన్లోనూ 19 వికెట్లతో సత్తాచాటారు.