News November 16, 2024
రేపు వరంగల్లో విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వరంగల్ హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి తెరకెక్కించారు.
Similar News
News November 17, 2025
RGNIYDలో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (<
News November 17, 2025
నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

తనకు దేవుడంటే నమ్మకం లేదంటూ <<18300800>>రాజమౌళి<<>> చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్న వేళ ఆయన పాత ట్వీట్ వైరల్ అవుతోంది. 2011లో ఓ అభిమాని జక్కన్నకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘థాంక్యూ. కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడు నా ఫేవరెట్’ అని రిప్లై ఇచ్చారు. మరి రాముడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.


