News April 24, 2024
విశ్వంభర.. భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి

వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 26 రోజులుపాటు కొనసాగిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ నిన్నటితో ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. ‘54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన సెట్లో ఫైట్ షూటింగ్ పూర్తిచేశాం. ఇంటర్వెల్లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న మూవీ విడుదల కానుంది.
Similar News
News January 7, 2026
ధనవంతులైనా విచారణను ఎదుర్కోవాల్సిందే: SC

విచారణను తప్పించుకోవడానికి ధనవంతులు చట్ట నియమాలను సవాల్ చేయడాన్ని CJI తప్పుబట్టారు. ఇలాంటి వాటిని అనుమతించేది లేదన్నారు. సాధారణ పౌరుల మాదిరి వారూ కోర్టు విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు. అగస్టావెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ డీల్ స్కామ్ కేసులో PMLA చట్టంలోని 44(1,c) ని సవాల్ చేస్తూ గౌతమ్ ఖేతాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. ధనవంతుడిని కాబట్టి స్పెషల్ హియరింగ్ ఇవ్వాలనడం సరికాదన్నారు.
News January 7, 2026
కవిత రాజీనామాకు ఆమోదం

TG: కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. నిన్న మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
News January 7, 2026
స్మిత్ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 5,085 రన్స్ చేశారు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్‌మాన్(AUS-5,028), బోర్డర్(AUS-4,850) ఉన్నారు. మరోవైపు అత్యధిక శతకాల జాబితాలో సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41), రూట్(41), సంగక్కర(38) తర్వాతి స్థానంలో స్మిత్(37) ఉన్నారు.


