News October 11, 2024

రేపే ‘విశ్వంభర’ టీజర్ విడుదల!

image

మెగాఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్‌ను రేపు ఉదయం 10.49కి విడుదల చేయనున్నట్లు ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్ చేశారు. సినీప్రియులు వేడుక చేసుకునేలా మూవీ ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News November 24, 2025

మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.