News September 24, 2024
అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15వేల కోట్ల మేర రుణం అందిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు మరోసారి అమరావతిలో పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో భేటీ అయ్యారు. భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ వర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Similar News
News January 31, 2026
ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం: YCP

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని YCP వాదిస్తోంది. మరోవైపు ‘మహా పాపం నిజం’ అని పలు ప్రాంతాల్లో TDP ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో YCP చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. ‘ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం నారా లోకేశ్’ అంటూ CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను టార్గెట్ చేసింది.
News January 31, 2026
అదానీకి అమెరికా ‘సమన్ల’ సెగ!

గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన ఫ్రాడ్ కేసులో విచారణకు అడ్డంకి తొలగిపోయింది. ఇన్నాళ్లూ సమన్లు అందలేదన్న టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిన ఈ కేసు ఇప్పుడు ముందుకు సాగనుంది. కోర్టు పత్రాలను స్వీకరించేందుకు USలోని ఆయన న్యాయవాదులు అంగీకరించారు. Adani Green Energy కోసం భారత అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై SEC ఈ సివిల్ కేసు వేసింది. దీనిపై స్పందించేందుకు కోర్టు వారికి 90 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది.
News January 31, 2026
పెరుగుట విరుగుట కొరకే!

‘పెరుగుట విరుగుట కొరకే’ అనేది సుమతీ శతకంలోని ఓ ప్రసిద్ధ పద్యం. ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు ఇది అతికినట్టే సరిపోతుంది. ఇటీవల ప్రతిరోజూ ఆకాశమే హద్దుగా రూ.వేలల్లో పెరుగుతూ వచ్చిన వీటి ధరలు నిన్నటి నుంచి నేలచూపులు చూస్తున్నాయి. వెండి కేజీపై రెండ్రోజుల్లో రూ.75వేలు, 10గ్రాముల బంగారంపై దాదాపు రూ.20వేలు తగ్గాయి. త్వరలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో సామాన్య ప్రజానీకానికి తగ్గిన ధరలు ఊరటనిస్తున్నాయి.


