News November 1, 2024

OTTలోకి వచ్చేసిన ‘విశ్వం’ మూవీ

image

గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన విశ్వం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 11న విడుదలై పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిశోర్, ప్రగతి, నరేశ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.

Similar News

News January 7, 2026

30ల్లో స్కిన్ కేర్ ఇలా..

image

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌, ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.

News January 7, 2026

జ్యోతిషం: పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలివే..

image

జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు వివాహ సమయాన్ని నిర్ణయిస్తాయి. జాతకంలో కళత్ర స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, ఆ స్థానంలో శని, రాహువు గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి ఆలస్యమవుతుంది. కుజ దోషం ఉన్నా, గురు గ్రహ అనుగ్రహం లోపించినా సంబంధాలు కుదరడం కష్టమవుతుంది. దోషాలను గుర్తించి తగిన శాంతులు చేయిస్తే ఆటంకాలు తొలగి వివాహ యోగం వస్తుంది. దోషాలు పోయేందుకు పరిష్కార మార్గాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 7, 2026

వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

image

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్‌లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.