News October 7, 2025
కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్‌స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్ లెంత్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
Similar News
News October 7, 2025
కర్ణాటకలో కులగణన.. స్కూళ్లకు 10 రోజుల సెలవులు

కులగణన సర్వే నేపథ్యంలో కర్ణాటక CM సిద్దరామయ్య రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్వేలో టీచర్లు పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఇవాళే ముగియాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మరో 10 రోజులు పొడిగించారు. అటు సర్వే చేస్తున్న ముగ్గురు సిబ్బంది మరణించగా రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
News October 7, 2025
స్టేడియంలోని స్టాండ్‌కు రవి కల్పన పేరు.. అసలు ఎవరీమె?

వైజాగ్‌లోని ACA-VDCA స్టేడియంలోని రెండు స్టాండ్‌లకు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, తెలుగు ప్లేయర్ రవి కల్పన పేర్లను పెట్టనున్నారు. రవి కల్పన కృష్ణాజిల్లాలో జన్మించారు. సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో స్థానం సంపాదించారు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన ఈమె భారత్ తరఫున 7 వన్డే మ్యాచ్‌లు ఆడారు. స్టేడియంలోని ఆ కొత్త స్టాండ్లను అక్టోబర్ 12న ప్రారంభించనున్నారు.
News October 7, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.