News November 29, 2024
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
Similar News
News November 29, 2024
స్కిల్ స్కామ్: చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
AP: స్కిల్ స్కామ్ కేసులో CM చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని గతంలో CID దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వర్చువల్గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనందున మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
News November 29, 2024
రేపు ‘అనంత’కు సీఎం చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ
AP: సీఎం చంద్రబాబు రేపు అనంతపురం జిల్లా బొమ్మనహాల్లో పర్యటించనున్నారు. నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో మధ్యాహ్నం 1.25 నుంచి 1.55 వరకు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. అదే గ్రామంలో ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఓ గంట పాటు స్థానిక ప్రజలతో సమావేశమై అర్జీలను స్వీకరిస్తారు. మ.3.45 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరుతారు.
News November 29, 2024
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్!
TG: లగచర్ల భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ తీసుకురానుంది. ఇందులో టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, వేరే కంపెనీలైతే ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని ఆలోచిస్తున్నట్లు సమాచారం.