News October 31, 2024
విక్రయాల్లో ‘వివో’.. విలువలో ‘శాంసంగ్’ టాప్
భారత్లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News October 31, 2024
పెట్టుబడులకు ఇదే మంచి సమయం: లోకేశ్
APలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. అమెరికాలో ఆయన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.
News October 31, 2024
REVIEW: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’
చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఏం చేశాడు? ఎలా చేశాడనేదే కథ. హీరో ఎదుర్కొనే అవమానాలు ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్టవుతాయి. అక్కడక్కడ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. దుల్కర్ నటన, డైరెక్టర్ వెంకీ రచన, BGM, డైలాగ్స్ సినిమాకు బలం. స్టాక్ మార్కెట్, బ్యాంకుల పనితీరు గురించి తెలియని వారికి సెకండాఫ్ అంతగా కనెక్ట్ అవ్వదు.
రేటింగ్: 3/5
News October 31, 2024
పుష్ప-2లో క్రేజీ సర్ప్రైజ్?
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్తో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని సమాచారం. ఇందులోనే మూడో పార్ట్కు అదిరిపోయే లీడ్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారనే చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.