News July 14, 2024
త్వరలో ‘వైజాగ్ ఫైల్స్’ విడుదల: గంటా

AP: త్వరలో కశ్మీర్ ఫైల్స్ తరహాలో ‘విశాఖ ఫైల్స్’ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైజాగ్లో జరిగిన భూదందాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ‘విశాఖ భూఆక్రమణల్లో సీఎస్ స్థాయి అధికారుల హస్తం ఉంది. అలాగే భూదందాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోనున్నాం. విశాఖ అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News December 8, 2025
2026లోనూ బంగారం ధరల పెరుగుదల: గోల్డ్ కౌన్సిల్

బంగారం ధరల పెరుగుదల వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటుండటం, గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం ఇందుకు కారణమని చెప్పింది. ఈ ఏడాది నవంబర్ వరకు బంగారం 60% పెరుగుదల కనబరిచిన విషయం తెలిసిందే.
News December 8, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.


