News March 18, 2024
విజయనగరం : కలెక్టరేట్లో ఎన్నికల కంట్రోల్ రూమ్

ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలెక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంట్లో మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మెనేజ్మెంట్ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగారు.
Similar News
News March 29, 2025
అనుమానస్పద స్థితిలో యువతి మృతి

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.
News March 29, 2025
ఈ నెల 31న గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్ అంబేద్కర్

ఈ నెల 31వ తేదీన సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా, కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఆ రోజున మండల కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్ ఉండదన్నారు.
News March 29, 2025
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: VZM SP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021లో నమోదైన పోక్సో కేసులో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన నిందితుడు కంది సన్యాసిరావు(19)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం తెలిపారు. రూ.10,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.