News March 16, 2024
విజయనగరం: ‘విద్యుత్ చౌర్యం చేస్తే సమాచారం అందించండి’

విద్యుత్ నిఘా శాఖ, DPE అధికారులు విజయనగరం సర్కిల్ పరిదిలో పలు ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ విజయనగరం సర్కిల్ సీఐ కె. కృష్ణ శనివారం తెలిపారు. తెర్లాం మండలం బూరిపేట, మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామాలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న నిందితుల నుంచి 1,03,548 అపరాద రుసుం, రూ.10వేలు జరిమానా విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సమాచారం తెలిస్తే 08922-234579కి తెలియజేయాలన్నారు.
Similar News
News November 30, 2025
VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
News November 30, 2025
2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాం: VZM కలెక్టర్

ఒక వేళ వర్షాలు పడితే ధాన్యం పాడవ్వకుండా 2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని రాం సుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరో 1600 టార్పాలిన్లు జిల్లాకు రానున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. చీపురుపల్లి, బొబ్బిలి డివిజన్లలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, విజయనగరం డివిజన్లో త్వరలో ప్రారంభమవుతుందన్నారు.
News November 30, 2025
ఎక్కువ కేసులు పరిష్కరించాలి: SP

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్కు ముందే ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. నాన్ బెయిలబుల్ వారంట్ల అమలుకు ప్రత్యేక బృందాలు, దర్యాప్తులో ఈ-సాక్ష్య యాప్ తప్పనిసరన్నారు. సిసిటీఎన్ఎస్లో కేసుల అప్లోడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


