News March 25, 2024
విజయనగరం ఎంపీ సీటు TDPకే..

AP: విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీయే బరిలోకి దిగనుంది. తొలుత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అయితే తాజాగా కమలం పార్టీ విజయనగరానికి బదులు రాజంపేట ఎంపీ స్థానాన్ని తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విజయనగరం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగే అవకాశముంది.
Similar News
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
మూవీ అప్డేట్స్

✹ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలు.. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
✹ ఇవాళ సాయంత్రం 6.11గంటలకు ‘రాజాసాబ్’ నుంచి రిలీజ్ కానున్న ‘రెబల్ సాబ్’ సాంగ్.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
✹ శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు!
✹ ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తెలుగులో ‘అమరకావ్యం’గా విడుదల కానుంది
News November 23, 2025
రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్‌పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్‌ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్‌కు పాలనాధికారం ఉంది.


