News March 24, 2025
VJA: అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్ఎస్) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజల నుంచి కలెక్టర్ 133 అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
Similar News
News December 10, 2025
రాంబిల్లి: విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు

రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వద్ద వీరి కోసం పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. పదవ తరగతి చదువుతున్న జస్వంత్, హిమతేజ, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు చెట్టు ఎక్కి గోడ దూకి పారిపోయారు. సరిగా చదవడం లేదని ఉపాధ్యాయులు వీరిని మందలించినట్లు తెలుస్తోంది.
News December 10, 2025
సూర్యాపేట: బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నూతనకల్ (M) లింగంపల్లిలో మంగళవారం రాత్రి ఘర్షణ రక్తసిక్తమైంది. కాంగ్రెస్, BRS వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో కర్రలు, రాళ్లతో సుమారు 70 మంది దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్యను చికిత్స కోసం HYD తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గ్రామంలో పోలీసులు మోహరించారు.
News December 10, 2025
NTR: భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృతి..!

వాంబేకాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాటరింగ్ పనులు చేసే అజయ్ కుమార్ మంగళవారం ఛాతినొప్పితో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యమార్గంలోనే మృతి చెందాడు. దీంతో ఆయన భార్య నాగలక్ష్మి తీవ్రంగా రోధించింది. అజయ్ కుమార్ అంత్యక్రియలు ముగించుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, నాగలక్ష్మి సైతం కన్నుమూసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.


