News February 17, 2025
VJA: ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చేటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడమేరు ఏరియాలో ఉండే మణికంఠ (32) ఈ నెల 6న తన భార్య, పిల్లలు బయటకు వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. శనివారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరోవైపు అప్పుల బాధ తాళలేక కట్టా వీర్రాజు అనే వ్యక్తి విషం తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సండే మృతి చెందాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 25, 2025
ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
ASF: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
భార్యపై ‘రిప్లింగ్’ కో-ఫౌండర్ సంచలన ఆరోపణలు

అనూప్ అనే వ్యక్తితో తన భార్య దివ్య అక్రమ సంబంధం పెట్టుకుందని రిప్లింగ్ కంపెనీ కో-ఫౌండర్, TNకు చెందిన ప్రసన్న శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారి చాట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. అందులో ఆమె ‘కండోమ్’ గురించి ప్రస్తావించిందని ప్రసన్న తెలిపారు. మరోవైపు భర్త తనను వేధిస్తున్నాడంటూ దివ్య ఫిర్యాదు చేయడంతో ప్రసన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి పదేళ్ల కిందట పెళ్లి కాగా ఓ కొడుకు ఉన్నాడు.