News February 13, 2026
VJA: ఆత్మహత్యే శరణ్యం అనుకున్న వేళ.. అండగా నిలిచిన ట్రాఫిక్ పోలీసులు

కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధపడిన మహిళను, ఆమె ఇద్దరు చిన్నారులను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. మచిలీపట్నానికి చెందిన స్వాతి భర్తతో గొడవపడి, విజయవాడ కాలువలో దూకుతానని ఫోన్ చేయడంతో అప్రమత్తమైన భర్త పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ట్రాఫిక్ RSI శ్రీధర్, కానిస్టేబుల్ నాగభూషణం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆమెను గుర్తించి ప్రాణాలు కాపాడారు. ట్రాఫిక్ DCP షరీనా బేగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News March 13, 2026
మూడో రోజూ బ్లడ్‌బాత్.. భారీ నష్టాలు

యుద్ధ భయాలు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 488(2.06) పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470(1.93) పాయింట్లు నష్టపోయి 74,563 వద్ద ముగిశాయి. నిఫ్టీ మూడు రోజుల్లో సుమారు 1,100 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. L&T(7.38%), టాటా స్టీల్(5.3%), ఎస్బీఐ(3.7%), బెల్(3%), మారుతి(3%) షేర్లు భారీగా నష్టపోయాయి.
News March 13, 2026
ఆ పథకంతో 17 వేల మందికి ఉపాధి: మంత్రి

AP: ‘సీఎం ఉపాధి సృష్టి’ పథకం ద్వారా ₹300Crతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థికసాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 17 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక APSP బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు, నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ₹119.27Cr మంజూరుకు ప్రతిపాదించామన్నారు.
News March 13, 2026
పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

విజయ్ దేవరకొండతో పెళ్లి వేడుకలు ముగియడంతో రష్మిక మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. తాను నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టైల్-2’ జూన్ 19న విడుదల కానున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. రష్మిక పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ నటిస్తున్నారు. 2012లో హిట్ అయిన ‘కాక్‌టైల్’కు ఇది సీక్వెల్.


