News April 12, 2025
VJA: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

ఇంటర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News November 15, 2025
కృష్ణా: కలెక్టరేట్లో చెత్తాచెదారం తొలగించిన కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ ఉద్యోగులు శ్రమదానం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతోపాటు వివిధ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రమదానంలో పాల్గొన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 14, 2025
కృష్ణా: పొలాల్లో తగ్గని వర్షపు నీరు.. కుళ్లిపోతున్న వరి పనలు

మొంథా తుపాన్ బారిన పడిన రైతాంగం నేటికీ కోలుకోలేని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొంది. తుపాన్ ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా నేటికీ కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు తగ్గకపోవటంతో దాని ప్రభావం దిగుబడులపై చూపుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షపు నీటిలో వరి పనలు నానిపోవడంతో ధాన్యపు కంకులు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


