News February 12, 2026

VJA: ఈ ఏడాది రోగులకు నరకమేనా?

image

విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో సెంట్రల్ ఏసీ పాడై నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎండలు పెరుగుతున్న వేళ గుండె, కిడ్నీ, న్యూరో వంటి కీలక విభాగాల్లోని రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఏసీ మరమ్మతుల కోసం రూ.1.59 కోట్ల ఫైల్ APMSIDC వద్ద పెండింగ్‌లో ఉంది. త్వరగా టెండర్లు పిలిచి తమను కాపాడాలని రోగులు వేడుకుంటున్నారు.

Similar News

News March 15, 2026

చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

image

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్‌కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

News March 15, 2026

నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

image

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.