News March 5, 2025
VJA: ఈ నెల 8న మహిళల కోసం కొత్తగా యాప్

మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను అందులోకి తెస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రక్షణకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శక్తి యాప్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సైతం ఈ యాప్ పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు.
Similar News
News November 19, 2025
మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News November 19, 2025
వరంగల్: సూరీడూ.. జల్దీ రావయ్యా..!

ఉమ్మడి వరంగల్లో చలి పెరిగిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు హాస్టళ్లు ఊరి చివర్లో ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ఉదయమే ఎండ కోసం తపిస్తున్నారు. సూర్యుడు రాగానే విద్యార్థులంతా బయటకు వచ్చి ఎండలో నిలబడుతున్నారు. దీంతో ఎండతో పాటు విటమిన్-డి సైతం లభిస్తుంది. పర్వతగిరిలోని KGBV హాస్టల్ విద్యార్థులు ఉదయం వేళలో ఇలా ఎండలో నిలబడుతున్నారు.
News November 19, 2025
మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.


